తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు: గవర్నర్ - తెలంగాణ గవర్నర్​ తాజా వార్తలు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్లిష్ట సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యులు పోరాడుతున్నారంటూ గవర్నర్‌ తమిళి సై అభినందించారు. రాజ్‌ భవన్‌ నుంచి వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్యులకు తామున్నామని ధైర్యం చెప్పారు.

వైద్యులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు: గవర్నర్
వైద్యులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు: గవర్నర్

By

Published : Jul 1, 2020, 8:06 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ నియంత్రణకు శక్తి వంచన లేకుండా పోరాడుతున్నాయని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌ రాజ్ భవన్ నుంచి వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లతో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సమావేశంలో గాంధీ సూపరింటెండెంట్‌ రాజా రావు, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నాగేంద్ర, వివిధ జిల్లాల ఆస్పత్రు సూపరింటెండెంట్‌లతో పాటు ఐఎంఈ సభ్యులు, పద్మా అవార్డ్ గ్రహీతలు డాక్టర్ రఘురామ్ పిల్లారిశెట్టి, మంజుల సహా పలువురు వైద్యులు పాల్గొన్నారు.

వైద్యులకు అండగా తాము ఉన్నామంటూ తమిళి సై ధైర్యం చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్లిష్ట సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యులు పోరాడుతున్నారంటూ అభినందించారు. వైద్యుల సేవలను గుర్తించి గౌరవించాలన్నారు. ఇక రాష్ట్రంలో సరిపడా పీపీఈ కిట్‌లు, మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా భారత రత్న డాక్టర్ బీసీ రాయ్ చిత్రపటానికి గవర్నర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

ABOUT THE AUTHOR

...view details