తెలంగాణ

telangana

ETV Bharat / state

'ముందుగానే గుర్తిస్తే.. ప్రాణాలు కాపాడుకోవచ్చు' - క్యాన్సర్​ను ముందు గుర్తించడంపై గవర్నర్

క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే.. విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని గవర్నర్‌ తమిళిసై అన్నారు. మెరుగైన, సమర్థవంతమైన వైద్య చికిత్సను అందించే అవకాశం ఉటుందని చెప్పారు.

'ముందుగానే గుర్తిస్తే.. ప్రాణాలు కాపాడుకోవచ్చు'
'ముందుగానే గుర్తిస్తే.. ప్రాణాలు కాపాడుకోవచ్చు'

By

Published : Sep 17, 2020, 4:56 AM IST

క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే.. విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని గవర్నర్‌ తమిళిసై అన్నారు. మెరుగైన, సమర్థవంతమైన వైద్య చికిత్సను అందించే అవకాశం ఉటుందని చెప్పారు. పీఈటీ, సిటిస్కాన్ యంత్రాన్ని గవర్నర్... వర్చువల్ మోడ్‌లో తమిళనాడులోని కన్యాకుమారిలోని శ్రీ మూకాంబికా క్యాన్సర్ సెంటర్‌లో ప్రారంభించారు.

ఏవైనా లక్షణాలు ఉంటే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని ప్రజలను కోరారు. నిపుణుల పర్యవేక్షణలో క్యాన్సర్‌ లక్షణాలను ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స చేయించుకోవడం వల్ల మరణాల రేటును తగ్గించుకోవచ్చని తమిళిసై సూచించారు.

ఇదీ చూడండి: అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

ABOUT THE AUTHOR

...view details