తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో... ప్రజలంతా కొవిడ్ ఆంక్షలకు అనుగుణంగా... సురక్షితంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవాలని గవర్నర్ కోరారు.
రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసిన గవర్నర్ - బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
నేటి నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కొవిడ్ ఆంక్షలకు అనుగుణంగా... సురక్షితంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసిన గవర్నర్
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ నిలుస్తోందన్న తమిళిసై సౌందరరాజన్... బతుకమ్మ సంబురాలు ప్రకృతి మాతకు పట్టం కట్టడం లాంటిదన్నారు. ఈ ఉత్సవాల్లో వినియోగించే పూలకు అత్యంత విలువైన మెడిసినల్ విలువలు ఉన్నాయని వాటిని చెరువుల్లో వదలటం వల్ల అనేక రకాల క్రిములు హరిస్తాయని గవర్నర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:బతుకమ్మ కోసమే విరబూస్తున్నట్లుగా... కట్టిపడేస్తున్నాయ్