తెలంగాణ

telangana

ETV Bharat / state

సత్యసాయి బాబా మందిరాన్ని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై - Hyderabad Satya Saibaba Trust Chairman AM Rao Latest News

హైదరాబాద్​ అంబర్​పేట శివంరోడ్డులోని సత్యసాయిబాబా మందిరాన్ని సాయంత్రం గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ సందర్శించారు. ట్రస్ట్ సభ్యులు గవర్నర్​కు స్వాగతం పలికారు.

Governor Tamilsai visiting Satyasai Baba Mandir
సత్యసాయి బాబా మందిరాన్ని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

By

Published : Nov 23, 2020, 10:40 PM IST

భగవాన్​ సత్య సాయిబాబా 95వ జయంతి పురస్కరించుకుని హైదరాబాద్​ అంబర్​పేట శివంరోడ్డులోని సత్యసాయిబాబా మందిరాన్ని సాయంత్రం గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ సందర్శించారు.

సత్యసాయి బాబా మందిరాన్ని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

హైదరాబాద్ సత్య సాయిబాబా ట్రస్ట్ ఛైర్మన్ ఏఎం రావు గవర్నర్​కు స్వాగతం పలుకుతూ... స్వామివారి ప్రసాదాలను అందజేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భగవాన్ సత్యసాయి బాబా భక్తులు అవడం చేత ప్రతి సంవత్సరం మద్రాసులోని సత్యసాయి జయంతి రోజున స్వామివారి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ దర్శించుకున్నారని తెలిపారు. కాసేపు అక్కడే గడిపిన గవర్నర్ స్వామివారి గీతాలను ఆలకించారు.

సత్యసాయి బాబా మందిరాన్ని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

ABOUT THE AUTHOR

...view details