తెలంగాణ

telangana

ETV Bharat / state

శాంతి స్థాపనలో ప్రజల నమ్మకం పొందడం కీలకం: గవర్నర్ - పోలీసులు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం

పోలీసులు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరాలను అరికట్టాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ కేడర్​కు చెందిన ఐదుగురు ప్రొబేషనరీ ఐపీఎస్​లతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పోలీసులు... శాంతి స్థాపనలో ప్రజల నమ్మకం పొందడం కీలకం : గవర్నర్
పోలీసులు... శాంతి స్థాపనలో ప్రజల నమ్మకం పొందడం కీలకం : గవర్నర్

By

Published : Aug 18, 2020, 10:44 AM IST

తెలంగాణ కేడర్​కు చెందిన ఐదుగురు ప్రొబేషనరీ ఐపీఎస్​లతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవలే సివిల్స్​లో ఉత్తమ ర్యాంకు సాధించిన రాష్ట్రానికి చెందిన ధాత్రిరెడ్డి, రష్మి పెరుమాల్, సుధీర్ రాంనాధ్, అశోక్ కుమార్, అక్షాంశ్ యాదవ్​లు దృశ్యమాధ్యమ సమావేశంలో పాల్గొన్నారు. ఐపీఎస్ అధికారులు... సామాన్యుల రక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శాంతి స్థాపనలో ప్రజల నమ్మకం పొందడం కీలకమని గవర్నర్ స్పష్టం చేశారు. నేరాల రూపు మారుతోందని, సైబర్ ప్రపంచంలో నేరాలు అధికమవుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు సరికొత్త ఆధునిక టెక్నాలజీతో సైబర్ నేరాలను అరికట్టాలన్నారు.

టెక్నాలజీ దుర్వినియోగం...

ప్రజలను మోసాల బారిన పడకుండా కాపాడాలని టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తమిళిసై అన్నారు. దేశ అంతర్గత రక్షణలో ఐపీఎస్​లను కెప్టెన్​లుగా అభివర్ణించారు. శాంతి భద్రతల రక్షణలో శాంతి, సామరస్యాలు నెలకొల్పడంలో పోలీసులు, ఐపీఎస్​లు ఎన్నో త్యాగాలు, బలిదానాలు చేశారన్నారు. వారి స్ఫూర్తితో అంకిత భావంతో కృషిచేయాలని అన్నారు. అందరి హక్కులను కాపాడాలని సూచించారు.

ఇవీ చూడండి : 'పోతిరెడ్డుపాడుపై అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు'

ABOUT THE AUTHOR

...view details