తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ జిల్లాల్లోని ఆదివాసీలకు పోషకాహార పంపిణీ: గవర్నర్​

ఆదివాసీల్లో పోషకాహార లోపాన్ని సరిదిద్దేందుకు గవర్నర్​ తమిళిసై సౌందర్​రాజన్​ వినూత్న కార్యక్రమం చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం, నాగర్​కర్నూల్​, ఆదిలాబాద్​ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో త్వరలో పోషకాహార పంపిణీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కార్యాచరణ రూపకల్పనకు సంబంధిత అధికారులతో రాజ్​భవన్​లో సమావేశమయ్యారు.

nutrition food for tribals, nutrition food for tribals
గవర్నర్​ తమిళిసై సౌందర్​రాజన్​

By

Published : Mar 27, 2021, 7:30 PM IST

మూరుమాల ప్రాంతాల గిరిజనుల కోసం పోషకాహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రకటించారు. రాజ్ భవన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని గిరిజన ఆవాసాల్లో పోషకార పంపిణీ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్ణీత వ్యవధిలో అమలయ్యేలా కార్యాచరణ రూపొందించాలని నేషనల్ న్యూట్రిషన్ ఇనిస్టిట్యూట్, రెడ్​క్రాస్ సొసైటీలను ఆదేశించారు.

రాజ్ భవన్​లో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారులు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనివాస్, రెడ్​క్రాస్ ప్రతినిధి మదన్మోహన్, ఈఎస్ఐ ఆస్పత్రి డీన్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఆదిమ తెగలకు చెందిన గిరిజనుల్లో సూక్ష్మపోషకాల లోపం తలెత్తుతోందని గవర్నర్​ అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా గిరిజనుల్లో పోషకాహార విలువలు పెంచేందుకు ఈ కార్యక్రమం దిక్సూచి అవుతుందని గవర్నర్​ వెల్లడించారు. గిరిజన, విద్య, వైద్య శాఖల సమన్వయంతో మెరుగైన ఫలితాలు సాదించవచ్చని గవర్నర్ పేర్కొన్నారు. కొల్లం, కొండి రెడ్డి, చెంచుల వంటి గిరిజన తెగల్లో ముందుగా పంపిణీ చేపట్టనున్నట్టు వివరించారు.

ఇదీ చదవండి:యాదాద్రి ఆలయంలో 30 మందికి కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details