మోదీతో గవర్నర్ తమిళిసై సమావేశం... ఆ విషయాలపై చర్చ!! - మోదీతో గవర్నర్ తమిళిసై సమావేశం
![మోదీతో గవర్నర్ తమిళిసై సమావేశం... ఆ విషయాలపై చర్చ!! Governor Tamilsai meeting with Prime Minister Modi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14941692-thumbnail-3x2-keee.jpg)
11:17 April 06
ప్రధాని మోదీతో గవర్నర్ తమిళిసై సమావేశం
రాష్ట్రంలో గిరిజనుల సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానని.. గవర్నర్ తమిళిసై తెలిపారు. ప్రధానితో సమావేశమైన గవర్నర్ పుదుచ్చేరిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను వివరించానని తెలిపారు. తెలంగాణలో 11 శాతం గిరిజన జనాభా ఉందని.. వాళ్ల సమస్యలపై తాను దృష్టిపెట్టిన విషయాన్ని ప్రధానికి తెలిపానన్నారు. ఇటీవల గిరిజన ప్రాంతాల్లో పర్యటనలతో సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని మోదీకి వివరించానని.. తమిళిసై వెల్లడించారు.
రాష్ట్రంలో ఇటీవల పరిణామాలను గవర్నర్, ప్రధానికి వివరించినట్లు తెలిసింది. ప్రొటోకాల్ వివాదంపైనా ప్రధానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారని.. అనేక కార్యక్రమాల్లో తనను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని గవర్నర్ తమిళిసై ప్రధానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.