చిరంజీవిని అభినందించిన గవర్నర్ తమిళిసై - చిరంజీవిని అభినందించిన గవర్నర్ తమిళిసై
గవర్నర్ తమిళిసై మెగాస్టార్ చిరంజీవిని అభినందించారు. చిరంజీవి... సీని కార్మికులకు ఉచితంగా టీకా అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సమాజం హితం కోసం చేస్తున్న ఈ పని చాలా మంచిదని ట్వీట్ చేశారు.
Governor Tamilsai and chiranjeevi
సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు ఉచితంగా టీకా అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందించారు. 45 ఏళ్ల పైబడిన సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులకు కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా అపోలో సహాకారంతో టీకాను ఉచితంగా అందించటం హర్షనీయమని ట్వీట్ చేశారు. సమాజం హితం కోసం చేస్తున్న ఈ పని చాలా మంచిదని, మెచ్చుకోదగినదని పేర్కొన్నారు.