శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్ఎల్‌వీ సీ-49 రాకెట్ విజయవంతంపై ఇస్రోకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందనలు తెలిపారు. తొమ్మిది ఇతర ఉపగ్రహాలతో పాటు ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు చేసిన కృషిని గవర్నర్ ప్రశంసించారు.
ఇస్రోకు గవర్నర్ తమిళిసై అభినందనలు
పీఎస్ఎల్వీ సీ49 ప్రయోగం విజయవంతంపై ఇస్రోను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందిచారు. తొమ్మిది ఇతర ఉపగ్రహాలతో పాటు దేశీయంగా రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు చేసిన కృషిని గవర్నర్ ప్రశంసించారు.
ఇస్రోకు గవర్నర్ తమిళిసై అభినందనలు
ఈ ప్రయోగం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు మన దేశాన్ని మరోసారి గర్వపడేలా చేశారని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి లాంటి కఠిన పరిస్థితుల్లో ఇస్రో కొత్త ఆశలను చూపించిందని.. ఇస్రో శాస్త్రవేత్తలు దేశంలోని కోట్లాది యువతియువకులకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు.