యోగా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అభిప్రాయపడ్డారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గవర్నర్.. ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా.. భారతీయ అత్యంత పురాతన వారసత్వ సంపదగా గవర్నర్ అభివర్ణించారు.
Governor tamilisai: 'కొవిడ్ నిబంధనలతో యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలి' - telangana news
జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలియజేశారు. 'యోగా ఫర్ వెల్బీయింగ్' థీమ్‌తో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం
కరోనా మహమ్మారి మానవాళికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న తరుణంలో... వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు యోగా మంచిమార్గమని తమిళిసై సూచించారు. 'యోగా ఫర్ వెల్బీయింగ్' అనే థీమ్‌తో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు గవర్నర్ తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:వరంగల్ పర్యటనలో కడియం శ్రీహరి ఆతిథ్యం తీసుకోనున్న సీఎం కేసీఆర్