తెలంగాణ

telangana

ETV Bharat / state

బోయిన్​పల్లి మార్కెట్​లో వ్యర్థాల నిర్వహణ అద్భుతం: గవర్నర్ - Governor tamilisai latest updates

బోయిన్​పల్లి మార్కెట్​లో విద్యుత్, బయోగ్యాస్ ప్లాంట్ పనితీరును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పరిశీలించారు. మన్‌కీ బాత్‌లో బోయిన్‌పల్లి మార్కెట్‌ గురించి ప్రధాని ప్రస్తావించిన నేపథ్యంలో గవర్నర్ ఇవాళ మార్కెట్​ను సందర్శించారు.

బోయిన్​పల్లి మార్కెట్​ను సందర్శించిన గవర్నర్
బోయిన్​పల్లి మార్కెట్​ను సందర్శించిన గవర్నర్

By

Published : Feb 2, 2021, 2:09 PM IST

బోయిన్​పల్లి మార్కెట్​ తరహాలో ఇళ్లు, కార్యాలయాల్లో కూడా బయో గ్యాస్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉద్భోదించారు. కూరగాయల వ్యర్థాలతో విద్యుత్‌, బయోగ్యాస్‌ ఎరువు తయారీ బాగుందని గవర్నర్‌ కొనియాడారు. మన్‌కీ బాత్​లో జాతినుద్దేశించి మోదీ చేసిన ప్రసంగంలో బోయిన్​పల్లి బయోగ్యాస్ ప్లాంటు గురించి ప్రస్తావించారని... రాష్ట్రానికి గర్వకారణమని తమిళి సై పేర్కొన్నారు.

సికింద్రాబాద్‌ బోయిన్​పల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డును గవర్నర్ ఇవాళ సందర్శించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి గవర్నర్‌కు స్వాగతం పలికారు. సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో గవర్నర్ కలియతిరిగారు.

కూరగాయల రైతుతో మాట్లాడిన తమిళిసై... ఏ గ్రామం నుంచి వచ్చారని అడిగి తెలుసుకున్నారు. వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన ఐఐసీటీ శాస్త్రవేత్తల బృందానికి ఆమె అభినందనలు తెలిపారు. బోయిన్​పల్లి కూరగాయల మార్కెట్‌ను సందర్శించడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారులు, ఐఐసీటీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:మోదీ మెచ్చిన మార్కెట్‌.. మన్‌కీ బాత్‌లో ప్రశంసలు

ABOUT THE AUTHOR

...view details