తెలంగాణ

telangana

ETV Bharat / state

Governor tamilisai: 'కొవిడ్​ మూడోదశను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి' - hyderabad district news

కొవిడ్​ కంట్రోల్​ కేంద్రం ఏర్పాటు.. ప్రభుత్వ గొప్ప ఆలోచన అని గవర్నర్​ తమిళిసై అన్నారు. హైదరాబాద్​ వెంగళరావు నగర్​లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్​లో ఉన్న కొవిడ్​ కంట్రోల్​ కేంద్రాన్ని గవర్నర్​ పరిశీలించారు. రాష్ట్రంలో లక్ష్యం మేరకు టీకా కార్యక్రమం కొనసాగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

governor tamilisai
గవర్నర్​ తమిళిసై

By

Published : Jun 26, 2021, 1:43 PM IST

కొవిడ్‌ మూడోదశను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పష్టం చేశారు. వైరస్‌ రెండో దశ ముప్పు తొలగిపోలేదన్న గవర్నర్‌ తమిళిసై.. ఇటీవలే మంత్రి కేటీఆర్​ హైదరాబాద్‌ వెంగళరావునగర్‌లో ప్రారంభించిన కొవిడ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని సందర్శించారు. కాల్‌సెంటర్‌ పనితీరు మెచ్చుకున్నారు.

వార్​ రూమ్​, కాల్​సెంటర్​ ద్వారా వైద్య సేవలు అందించడం అభినందనీయమని కలెక్టర్​ అన్నారు. కరోనా బాధితులకు అందుబాటులో ఉన్న పడకలు, ఔషధాలు, అంబులెన్సులు, వ్యాక్సిన్‌ తదితర సమాచారాన్ని కొవిడ్‌ కంట్రోల్‌ కేంద్రంలో అందిస్తున్నట్లు గవర్నర్‌ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి టీకా డోసులు పంపిణీ చేసిన వైద్యారోగ్యశాఖకు గవర్నర్​ శుభాకాంక్షలు తెలియజేశారు. మూడో వేవ్​ను ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో లక్ష్యం మేరకు టీకా కార్యక్రమం కొనసాగుతుండటంపై హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:MAA ELECTIONS: 'నాగబాబు వ్యాఖ్యలు తప్పుబట్టిన నరేశ్'

ABOUT THE AUTHOR

...view details