కరోనా వ్యాక్సిన్-- కొవాగ్జిన్ కోసం శాస్త్రవేత్తలు అహర్నిషలు కష్టపడుతున్నారని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ శామీర్‌పేటలోని భారత్ బయోటెక్‌ను తమిళిసై సందర్శించారు. కొవాగ్జిన్ తయారీలో అత్యంత శ్రద్ధపెట్టి పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చానని గవర్నర్ చెప్పారు.
కొవాగ్జిన్ కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు: గవర్నర్ - Bharath biotech in Hyderabad
కరోనా వ్యాక్సిన్.. కొవాగ్జిన్ తయారీలో శాస్త్రవేత్తలు అత్యంత శ్రద్ధపెట్టి పనిచేస్తున్నారని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మోదీ చెప్పినట్లు దేశంలో కొవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు
![కొవాగ్జిన్ కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు: గవర్నర్ Telangana governor tamilisai sounderarajanTelangana governor tamilisai sounderarajan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8979971-618-8979971-1601368660319.jpg)
భారత్ బయోటెక్‌ను సందర్శించిన గవర్నర్ తమిళిసై
ఇప్పటి వరకు భారత్ బయోటెక్ ఇతర వ్యాక్సిన్‌లు ప్రపంచ వ్యాప్తంగా 3మిలియన్ల డోసులు సరఫరా చేసిందని తమిళిసై పేర్కొన్నారు. 2020లోనే కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తక్కువ ధరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పీపీఈ కిట్లు ధరించి ఎక్కువ గంటలు పనిచేస్తున్న శాస్త్రవేత్తలను అభినందించారు.
- ఇదీ చూడండిభూ సేకరణ అంశంలో మరింత స్పష్టత అవసరం
Last Updated : Sep 29, 2020, 2:52 PM IST