కరోనా పూర్తిగా తగ్గిపోలేదని.... కేసులు ఇంకా వస్తూనే ఉన్నాయని... ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై (GOVERNER TAMILISAI) సూచించారు. తాజాగా రాష్ట్రంలో 168 కేసులు నమోదైన నేపథ్యంలో(covid cases in Telangana).. దీన్ని బట్టి పరిస్థితి అర్థమవుతుందని గవర్నర్ అన్నారు.
GOVERNER TAMILISAI: కొవిడ్ పూర్తిగా తగ్గిపోలేదు.. వాటిని విస్మరించవద్దు
రాష్ట్రంలో కొవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గిపోలేదని.. కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయని గవర్నర్ తమిళిసై (GOVERNER TAMILISAI) పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
tamilisai
ప్రజలు భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని, అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ గవర్నర్ ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి:Covid cases in India: దేశంలో మరో 16,862 మందికి కరోనా