తెలంగాణ

telangana

ETV Bharat / state

తాగు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి: తమిళిసై

రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ తమిళిసై.. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.

తాగు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి: తమిళిసై
తాగు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి: తమిళిసై

By

Published : Mar 15, 2021, 12:32 PM IST

తాగు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి: తమిళిసై

కొత్త రాష్ట్రంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామని గవర్నర్ తమిళిసై బడ్జెట్ సమావేశాల్లో పేర్కొన్నారు. నీటి వివాదాలు స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడంతో పాటు....పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేసి 20లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. కరవు ప్రాంతాలకూ సాగునీరు అందించిన ఘనత తమదేనని స్పష్టం చేశారు. గోదావరి ప్రాజెక్టుల్లో 227 టీఎంసీలు నిల్వ ఉంచుతున్నామని తెలిపారు. విభజనకు ముందున్న 11.43 టీఎంసీలను 227 టీఎంసీలకు పెంచామని వివరించారు.

మిషన్‌ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ ద్వారా గిరిజన గ్రామాలు, తండాలకూ తాగునీరు అందించినట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు.. మిషన్‌ కాకతీయ ద్వారా 30వేల చెరువులు పునరుద్ధరించామని వివరించారు. ప్రభుత్వ చర్యల వల్ల భూగర్భ జలాలు బాగా పెరిగాయని ఈ సందర్భంగా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details