ఇంట్లోనే ఉంటూ రక్షాబంధన్ పర్వదినాన్ని సురక్షితమైన వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ సూచించారు. రేపటి రాఖీపౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రక్షాబంధన్... సోదరీ, సోదరుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
'రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతీ ఒక్కరం ప్రతిజ్ఞ చేద్దాం...' - governer news
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌదర్రాజన్ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఇంట్లోనే ఉంటూ... సురక్షిత వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని గవర్నర్ సూచించారు. కరోనా వైరస్‌పై విజయం సాధించేందుకు అన్ని మార్గదర్శకాలను, ముందస్తు జాగ్రత్తలను పాటిస్తామని ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేద్దామని గవర్నర్ సూచించారు.
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య శాశ్వత బంధానికి ప్రతీక లాంటిదన్న గవర్నర్... బేటి బచావో- బేటి పడావో మిషన్ స్పూర్తితో రక్షాబంధన్‌ను జరుపుకుందామన్నారు. సోదరుల మణికట్టు మీద ముడిపడి ఉండే రాఖీ... సోదరీమణులకు రక్షణకు చిహ్నం లాంటిదన్నారు. రక్షాబంధన్ పర్వదినాన్ని సోదరులు, సోదరీమణులు ఆప్యాయతతో జరుపుకోవాలని సూచించారు. కరోనా వైరస్‌పై విజయం సాధించేందుకు అన్ని మార్గదర్శకాలను, ముందస్తు జాగ్రత్తలను పాటిస్తామని ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేద్దామని గవర్నర్ పిలుపునిచ్చారు.