Governor Wishes To CM KCR: సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయనకు గవర్నర్ పుష్పగుచ్ఛం, లేఖ పంపించారు. కేసీఆర్ సంపూర్ణారోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ లేఖలో తెలిపారు. స్వల్ప అస్వస్థతతో కేసీఆర్ నిన్న ఆస్పత్రికి వెళ్లారని తెలిసి ఆందోళన చెందానని పేర్కొన్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్ చేశారు.
విశ్రాంతి అవసరం
కేసీఆర్ శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో పాటు ఎడమచేయి నొప్పిగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అన్ని ఫలితాలు సాధారణంగా వచ్చాయని, కేసీఆర్ ఆరోగ్యం బాగుందని వైద్యులు ప్రకటించారు. వరుస పర్యటనల ద్వారా కేసీఆర్ అలిసిపోయారని.. ఆయనకు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారు.
ఇవీ చదవండి:కేసీఆర్కు ఏమైంది.. ఆయన వ్యక్తిగత వైద్యులేమంటున్నారు..?
కేసీఆర్కు వారం రోజుల విశ్రాంతి అవసరం: యశోద వైద్యులు