తెలంగాణ

telangana

ETV Bharat / state

వామన్‌రావు దంపతుల హత్య కేసుపై ప్రభుత్వానికి గవర్నర్‌ లేఖ - telangana varthalu

న్యాయవాది హత్యకేసులో విచారణ వేగవంతం చేయాలని గవర్నర్​ తమిళిసై ప్రభుత్వానికి లేఖ రాశారు. దోషులకు శిక్షపడేలా చూడాలని లేఖలో ప్రభుత్వానికి సూచించారు.

వామన్‌రావు దంపతుల హత్య కేసుపై ప్రభుత్వానికి గవర్నర్‌ లేఖ
వామన్‌రావు దంపతుల హత్య కేసుపై ప్రభుత్వానికి గవర్నర్‌ లేఖవామన్‌రావు దంపతుల హత్య కేసుపై ప్రభుత్వానికి గవర్నర్‌ లేఖ

By

Published : Feb 24, 2021, 4:40 PM IST

పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాద దంపతులు వాహన్​ రావు, నాగమణిల హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. తాజాగా న్యాయవాది వామన్ రావు దంపతుల హత్యకేసులో విచారణ వేగవంతం చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

జరిగిన ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులకు తగిన శిక్ష పడేలా చూడాలని తమిళిసై లేఖలో ప్రభుత్వానికి తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక పంపాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ను పరామర్శించిన సీఎం

ABOUT THE AUTHOR

...view details