మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే.. కుటుంబంతో పాటు.. దేశ అభ్యున్నతికి పాటుపడుతారని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. హైదరాబాద్ ఎన్‌ఐఆర్‌డీలోని రూరల్ టెక్నాలజీ పార్కులో 17వ గ్రామీణ ఉత్పత్తుల అమ్మకాల మేళాను గవర్నర్ ప్రారంభించారు. మేళాకు 23 రాష్ట్రాల నుంచి స్వయం సహాయక గ్రూపుల మహిళలు హాజరయ్యారు. 5 రోజులపాటు ఈ గ్రామీణ ఉత్పత్తుల అమ్మకాల ప్రదర్శన కొనసాగనుంది.
మహిళా సాధికారత థీమ్‌తో ప్రదర్శన జరగటం అభినందనీయమని గవర్నర్ తమిళిసై అన్నారు. హస్తకళలు, టెర్రాకోట్ ఆభరణాలంటే తానెంతో ఇష్టపడుతానన్న గవర్నర్.. ఇటువంటి గ్రామీణ ఉత్పత్తుల కొనుగోలు చేసి ఈ మహిళా వ్యాపారులకు చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ పిలుపునిచ్చారు. మహిళా సాధికారత, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని తెలిపారు. ఎస్‌హెచ్‌జీల సంక్షేమం కోసం పథకాలను, కార్యక్రమాలను అందిపుచ్చుకోవాలని గవర్నర్ సూచించారు.
'మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబానికి వెలుగు' - గ్రామీణ ఉత్పత్తుల అమ్మకాల మేళాను ప్రారంభించిన గవర్నర్
హైదరాబాద్‌లోని ఎన్‌ఐఆర్‌డీలోని రూరల్ టెక్నాలజీ పార్కులో గ్రామీణ ఉత్పత్తుల అమ్మకాల మేళాను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. మహిళా సాధికరత ధ్యేయంగా ప్రదర్శన జరగడం అభినందనీయని తెలిపారు.
గ్రామీణ ఉత్పత్తుల అమ్మకాల మేళాను ప్రారంభించిన గవర్నర్
Last Updated : Nov 29, 2019, 11:46 PM IST