రేపటి నుంచి రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల అధ్యాపకులతో ప్రస్తుత విద్యా వ్యవస్థపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చర్చించనున్నారు.
బోధన సిబ్బందితో శుక్రవారం గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ - governor video conference with lectures
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల బోధన సిబ్బందితో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. విద్యా వ్యవస్థపై లాక్డౌన్ ప్రభావం, తదితర అంశాలపై చర్చించనున్నారు.
బోధన సిబ్బందితో రేపు గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్
కరోనా సంక్షోభం నుంచి విద్యా వ్యవస్థను ఎలా గట్టెక్కించాలనే అంశంపై గవర్నర్ మార్గదర్శనం చేయనున్నారు. లాక్డౌన్ ప్రభావం, కొత్త విద్యా సంవత్సరంలో సవాళ్లు, బోధన సిబ్బంది సమస్యలు, తదితర వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలోకి మిడతలు రాకుండా ప్రత్యేక కమిటీ: సీఎం కేసీఆర్