కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీ, సరఫరాలో భారత్ గ్లోబల్ లీడర్‌గా అవతరించనుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వరల్డ్ తమిల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ మెడికల్ ఎక్సలెన్స్ ఈవెంట్లో వర్చువల్‌గా గవర్నర్ పాల్గొన్నారు.
దేశ 60 శాతం వ్యాక్సిన్ అవసరాలను తీరుస్తూ.. అతిపెద్ద వ్యాక్సిన్ సరఫరాదారుగా ఉన్న భారత్ వైపు.. ప్రపంచ దేశాలు చూసేలా చేస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి వ్యాక్సినేషన్ అందించే.. ఓ బలమైన వ్యాక్సినేషన్ విధానాన్ని తీసుకురావాలని గవర్నర్ అన్నారు.