సరిహద్దులో అహర్నిశలు శ్రమిస్తూ దేశభద్రతను కాపాడుతున్న సైనికుల సేవలు ఎనలేనివని... గవర్నర్ తమిళిసై కొనియాడారు. సైనికులు అనేక త్యాగాలు చేసి కుటుంబాలకు దూరంగా ఉంటూ... తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశరక్షణలో... ఎనలేని పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు.
సైనిక కుటుంబాలకు తోడ్పాటు అందించండి: గవర్నర్ - సైనికుల సేవలు మరువలేనివన్న గవర్నర్ తమిళిసై
దేశభద్రతను కాపాడుతున్న సైనికుల సేవలు మరువలేనివని గవర్నర్ తమిళిసై అన్నారు. సైనికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్నారని తెలిపారు. సైనిక కుటుంబాలకు తోడ్పాడు అందించేందుకు నేడు సాయుధ దళాల పతాక దినోత్సవం జరుపుకుంటున్నామని వెల్లడించారు. పౌరులంతా ముందుకొచ్చి సహకరించాలని గవర్నర్ తమిళిసై కోరారు.
'ఆ సైనికుల కుటుంబ సభ్యులకు తోడ్పాటునందించాలి'
నేడు సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహిస్తున్నారని, ఈ తరుణంలో పౌరులు ముందుకు వచ్చి... అసువులు బాసిన సైనికుల కుటుంబ సభ్యులకు తోడ్పాడు అందించాలని గవర్నర్ కోరారు. పతాక దినోత్సవం విరాళం పేరిట సహాయం అందించాలని తమిళిసై విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :తెలంగాణకు కోటిన్నర కొవిడ్ టీకాలు.. సర్కారు ప్రణాళికలు