హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో ప్రజలు సహకరించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. ప్రజలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆపదలో ఉన్న వారికి సేవలను అందిస్తున్న రెడ్‌క్రాస్ వాలంటీర్లను గవర్నర్ ప్రశంసించారు.
భాగ్యనగరంలో బీభత్సం.. ప్రతి ఒక్కరు సాయం చేయండి: గవర్నర్
హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి జన జీవనం స్తంభించిపోయింది. రోడ్లన్ని ధ్వంసం అయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చర్యలే కాకుండా, మనలో ప్రతి ఒక్కరూ ప్రజలకు సహాయం చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై కోరారు. రెడ్‌క్రాస్ తరపున సేవలు చేస్తున్న వారిని ఈ సందర్భంగా ట్వీట్టర్ ద్వారా అభినందించారు.
భాగ్యనగరంలో బీభత్సం.. ప్రతి ఒక్కరూ సహాయం చేయాలి : గవర్నర్
భాగ్యనగరంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్ని నీటితో నిండిపోయాయి. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లు ధ్వసం అయ్యాయి. మరికొన్ని చోట్ల ప్రజలు నీళ్లల్లో చిక్కుకుపోయారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇదీ చూడండి :జీహెచ్‌ఎంసీలో వర్ష బీభత్సం... అత్యవసర సేవల నంబర్లు ఇవే