తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రధాని నిర్ణయం ఓ మైలురాయిగా నిలిచిపోతుంది: గవర్నర్​ - తెలంగాణ తాజా వార్తలు

18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటం పట్ల ప్రధానమంత్రి మోదీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్​భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుదుచ్చేరిలోని అధికారులతో వ్యాక్సినేషన్ ప్రక్రియపై తమిళిసై సమీక్ష నిర్వహించారు.

Governor Tamilisai
Governor Tamilisai

By

Published : Jun 7, 2021, 9:56 PM IST

భారతదేశ చరిత్రలో.. కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా మోదీ తీసుకున్న నిర్ణయం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని గవర్నర్​ తమిళిసై పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై పుదుచ్చేరిలోని అధికారులతో రాజ్​భవన్​ నుంచి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా తమిళిసై సమీక్ష నిర్వహించారు. ప్రధాని.. దార్శనికతతో గతేడాది మే లో వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి... దేశీయంగా టీకా ఉత్పత్తికి చర్యలు తీసుకోవటం వల్లనే రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయన్నారు.

అభివృద్ధి చెందిన ఏ దేశానికీ తీసిపోకుండా భారతదేశం వ్యాక్సిన్ తయారీ, పంపిణీలో ముందంజలో ఉందని... ప్రధానమంత్రి చేపడుతున్న కార్యక్రమాలతో దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యలతో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి దేశంలో పది రెట్లు పెరిగినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 1,933 కరోనా కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details