తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో పరిస్థితులపై మంగళవారం గవర్నర్ సమీక్ష - కరోనాపై గవర్నర్​ సమీక్ష

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో రాష్ట్రంలోని స్థితిగతులపై గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ఉన్నతాధికారులతో మంగళవారం రాజ్​భవన్​లో సమీక్షించనున్నారు. ఈ మేరకు సీఎస్​ సోమేశ్​కుమార్,​ వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలకు గవర్నర్​ పిలుపు అందింది.

governor tamilisai review at rajbhavan on corona status in state
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్షించనున్న గవర్నర్

By

Published : Jul 6, 2020, 7:19 PM IST

రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్రంలోని పరిస్థితులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమీక్షించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్య-ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో గవర్నర్ సమీక్ష నిర్వహించనున్నారు.

ఈ మేరకు వారికి రాజ్ భవన్ నుంచి పిలుపు వచ్చింది. ఉన్నతాధికారులతో గవర్నర్ రేపు సమీక్షించి రాష్ట్రంలో పరిస్థితులను వాకబు చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, పరీక్షలు, నియంత్రణా చర్యలు, రోగులకు అందుతున్న చర్యలు, సదుపాయాలు, వసతులు తదితర అంశాలపై గవర్నర్ అధికారులతో చర్చించనున్నారు.

ఇదీ చదవండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్

ABOUT THE AUTHOR

...view details