తెలంగాణ

telangana

ETV Bharat / state

Governor Tamilisai: 'ఆదివాసీల జీవనోపాధి, ఆర్థికస్థితి మెరుగుపడాలి'

Governor Tamilisai: ఆదివాసీ గిరిజన తెగల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని గవర్నర్‌ తమిళిసై సూచించారు. వారి పోషకాహారం, జీవనోపాధి, ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నారు. గిరిజనులకు సుస్థిర వ్యవసాయ పద్ధతులు, పశుపోషణ, పాడి, కూరగాయల సాగులో శిక్షణ ఇవ్వాలని కోరారు.

Governor Tamilisai
Governor Tamilisai

By

Published : Dec 17, 2021, 9:49 AM IST

Governor Tamilisai: ఆదివాసీ గిరిజన తెగలకు చెందిన ప్రజల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని గవర్నర్‌ తమిళిసై సూచించారు. వారి పోషకాహారం, జీవనోపాధి, ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నారు. ఆదిలాబాద్‌, నాగర్‌కర్నూలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గిరిజనులకు పోషకాహార వృద్ధిపై రాజ్‌భవన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాన్ని గురువారం రోజు గవర్నర్‌ సమీక్షించారు. గిరిజనుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంతో కార్యక్రమాలను చేపడుతున్నామని, ప్రణాళికాబద్ధంగా వాటిని నిర్వహిస్తామని తెలిపారు.

వ్యవసాయ, పశువైద్య, ఉద్యానవన విశ్వవిద్యాలయాలు గిరిజనులకు సుస్థిర వ్యవసాయ పద్ధతులు, పశుపోషణ, పాడి, కూరగాయల సాగులో శిక్షణ ఇవ్వాలని కోరారు. సమావేశంలో తెలంగాణ వ్యవసాయ, ఉద్యానవన, పశువైద్య, కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం, రెడ్‌క్రాస్‌ సొసైటీ, జాతీయ పౌష్టికాహార సంస్థ, ఈఎస్‌ఐ వైద్యకళాశాలల అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:haritha nidhi: హరితనిధికి విధివిధానాలను ప్రకటించిన ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details