తెలంగాణలో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్రంలోని పరిస్థితిపై ఆరా తీశారు. పుదుచ్చేరి నుంచి వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో ఫోన్లో మాట్లాడారు.
మంత్రి ఈటలకు గవర్నర్ తమిళిసై ఫోన్ - వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తాజా వార్తలు
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఫోన్ చేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈటల రాజేందర్, గవర్నర్ తమిళిసై ఫోన్
కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్.. వ్యాధి నిర్ధరణ పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్స వివరాలపై ఆరా తీశారు. అర్హులైన వారందరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
ఇదీ చదవండి:హిందూ దేవుడికి పరమ భక్తుడైన ముస్లిం!