సికింద్రాబాద్ పద్మారావు నగర్ స్కందగిరి ఆలయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విచ్చేశారు. కార్తీక మాసం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామిని దర్శించుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని... రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గవర్నర్ రాకతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. భక్తి శ్రద్ధలతో భజనలు, పాటలతో ప్రాంగణం మార్మోగింది. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సుబ్రహ్మణ్య స్వామికి గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు - telanagana governor tamilisai at skandagiri temple in secunderabad
కార్తీక మాసం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని స్కందగిరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తమిళిసై తెలిపారు.
సుబ్రహ్మణ్య స్వామికి గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు