తెలంగాణ

telangana

ETV Bharat / state

Governor: విలువైన జీవితాలను కాపాడుతున్న వారందరికీ సెల్యూట్: తమిళిసై - గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

ఎంతో విలువైన జీవితాలను కాపాడుతున్న రక్తదాతలందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వారి సేవలను గుర్తించి అభినందించాలని ఆమె తెలిపారు. ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్‌ ప్రతినిధులతో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమీక్షలో గవర్నర్ పాల్గొన్నారు.

governor tamilisai participated video conference
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

By

Published : Jun 14, 2021, 6:42 PM IST

ప్రస్తుత సమాజంలో యువతకు రక్తదానంపై అవగాహన కల్పించి వారిని ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ సూచించారు. రక్తదానమంటే జీవన దానమని ఆమె పేర్కొన్నారు. ఎందరో విలువైన జీవితాలను కాపాడుతున్న వారందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్‌ ప్రతినిధులతో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమీక్షలో గవర్నర్ పాల్గొన్నారు.

రక్తనిల్వలపై కొవిడ్ ప్రభావం:

కొవిడ్ సంక్షోభం రక్త నిల్వలు, రక్తదానంపై తీవ్ర ప్రభావం చూపిందని గవర్నర్ తెలిపారు. రక్త నిల్వలు సరిపడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రోజుకు దాదాపు 600 బ్లడ్ యూనిట్స్ సరఫరా చేసి తలసేమియా వ్యాధి బారిన పడిన చిన్నారులను రక్షిస్తున్న తెలంగాణ రెడ్ క్రాస్ సేవలను ఆమె అభినందించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ, ప్రస్తుత సంక్షోభంలోనూ వారు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. రక్తదానాన్ని ప్రోత్సహించడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. రక్తదానం పట్ల అపోహలను తొలగించి యువతను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే రక్తదాతల సేవలను గుర్తించి వారిని అభినందించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారుFor

ఇదీ చూడండి:Etela: హుజూరాబాద్​లో వంద శాతం పోటీ చేస్తా.. గెలుస్తా..

ABOUT THE AUTHOR

...view details