తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధి చెందిన దేశాల్లోనే.. బూస్టర్‌ డోసు లేదు: గవర్నర్‌ - sankranthi sambaralu in telangana

Pongal Celebrations in Raj bhavan: రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్‌భవన్‌లో పండుగ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై.. పాలు పొంగించి పొంగలి వండారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి జరుపుకోవాలని గవర్నర్‌ సూచించారు.

sankranthi in raj bhavan
రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు

By

Published : Jan 15, 2022, 1:42 PM IST

కరోనా సోకకుండా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలి: గవర్నర్‌

Pongal Celebrations in Raj bhavan: సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కొవిడ్ నేపథ్యంలో మార్గదర్శకాలు అనుగుణంగా పండుగ జరుపుకోవాలని గవర్నర్‌ సూచించారు. రాజ్‌భవన్‌లో సంక్రాంతి సంబురాలు అట్టహాసంగా జరిగాయి. వేడుకల్లో గవర్నర్ తమిళిసై కుటుంబసభ్యులు, రాజ్‌భవన్‌ అధికారులు పాల్గొన్నారు. గవర్నర్‌.. పాలు పొంగించి పొంగలి వండారు.

రాష్ట్ర ప్రజలందిరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా రైతులకు అభినందనలు. రెండేళ్లుగా రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలి. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. -- తమిళిసై సౌందర రాజన్‌, తెలంగాణ గవర్నర్‌

కరోనా కట్టడి చర్యల్లో కృషి నేపథ్యంలో ప్రధాని మోదీ, రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై ధన్యవాదాలు తెలిజేశారు. కరోనా సోకకుండా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని గవర్నర్‌ కోరారు. ప్రతి ఒక్కరూ రెండో వాక్సిన్ తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా బూస్టరు డోస్ అందుబాటులో లేదని.. కానీ భారత్‌లో అందుబాటులో ఉందని వెల్లడించారు.

ఇదీ చదవండి:పండుగ రోజున 'మారుతి' షాక్- కార్ల ధరలు భారీగా పెంపు

ABOUT THE AUTHOR

...view details