తెలంగాణ

telangana

ETV Bharat / state

Governor Tamilisai : 'సవాళ్లు లేకుండా ఎవరి జీవితం సాగదు' - GOVERNOR TAMILISAI

Governor Tamilisai at Ambedkar University : జీవితం అనేది అంత సులభం కాదని.. సవాళ్లు లేకుండా ఎవరి జీవితం సాగదని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకెళ్లాలన్నారు. హైదరాబాద్​లోని అంబేడ్కర్​ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవం వేడుకల్లో పాల్గొన్న గవర్నర్​.. విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

GOVERNOR TAMILISAI
GOVERNOR TAMILISAI

By

Published : Aug 6, 2022, 12:36 PM IST

Governor Tamilisai at Ambedkar University : సవాళ్లు లేకుండా ఎవరి జీవితం సాగదని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని సూచించారు. హైదరాబాద్​లోని అంబేడ్కర్​ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవం వేడుకల్లో తమిళిసై ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని గవర్నర్​ విద్యార్థులకు మార్గనిర్దేశనం చేశారు. నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. అదే సమయంలో అందరూ కరోనా వాక్సిన్​ వేయించుకోవాలని, యోగా చేయాలని.. మంచి ఆహారం తీసుకోవాలని గవర్నర్​ తమిళిసై సూచించారు.

'జీవితం అనేది అంత సులభమైంది కాదు. యువత సవాళ్లను ఎదుర్కోవడం లేదు. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకెళ్లాలి. మంచి ఆరోగ్య జీవన శైలి పెంపొందించుకోవాలి. కరోనా వ్యాక్సిన్‌ను ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి.'- తమిళిసై సౌందరరాజన్, గవర్నర్

ఇదిలా ఉండగా.. గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ రేపు నిజామాబాద్​ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయానికి వెళ్లనున్నారు. వర్సిటీలో జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో పాల్గొననున్నారు.

ABOUT THE AUTHOR

...view details