తెలంగాణ

telangana

ETV Bharat / state

Tamilisai on Rape case: రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పించండి: తమిళిసై - సీఎస్

Tamilisai on Rape case: జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనపై స్పందించిన గవర్నర్‌ తమిళిసై స్పందించారు. రెండు రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని సీఎస్, డీజీపీని గవర్నర్ ఆదేశించారు. బాలికపై అత్యాచారం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు.

Tamilisai on Rape case
ర్నర్‌ తమిళిసై

By

Published : Jun 5, 2022, 12:35 PM IST

Updated : Jun 5, 2022, 1:05 PM IST

Tamilisai on Rape case: జూబ్లీహిల్స్ ఘటనపై రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అందించాలని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆదేశించారు. బాలికపై అత్యాచార ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. ఈ మేరకు సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు.

అత్యాచార ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్.. మీడియాలో వస్తున్న కథనాలను నిశితంగా పరిశీలించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమంటూ తమిళిసై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే ప్రతిపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కాంగ్రెస్ శ్రేణులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించాయి. ఈ ఘటనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ భాజపా నేతలు డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు.

Last Updated : Jun 5, 2022, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details