Governor Tamilisai On TSRTC Bill Issue :తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు(TSRTC) చెందిన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన బిల్లుపై ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఆర్టీసీ బిల్లుపై తగిన సూచనలు తీసుకుని రెండ్రోజుల్లో ఆమోదం తెలుపనున్నట్లు రాష్ట్ర గవర్నర్ తమిళిసై(Telangana Governor Tamilisai) చెప్పారని ఆర్టీసీ జేఏసీ నేతలు వెల్లడించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించి ఇటీవల అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగా.. ఈ మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు గవర్నర్‌ను కలిశారు. బిల్లును వీలైనంత త్వరగా ఆమోదించాలని ఆమెను కోరారు.
కార్మికుల సమస్యలు, విలీన ప్రక్రియకు సంబంధించి గవర్నర్‌కు పలు సూచనలను చేసినట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. సుమారు నెల రోజుల నుంచి ఆర్టీసీ విలీన బిల్లు పెండింగ్‌లో ఉందని.. ఆ విషయాన్నే గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తన వద్దకు ప్రభుత్వం నుంచి నాలుగు రోజుల క్రితమే బిల్లు వచ్చినట్లు గవర్నర్ తెలిపారని పేర్కొన్నారు. తమ వద్దకు వచ్చిన బిల్లులో పది సూచనలు చేసినట్లు గవర్నర్ తమతో పేర్కొన్నారని వెల్లడించారు. తాము చెప్పిన సమస్యలపై తమిళిసై సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.
పదవీ విరమణ పొందిన కార్మికులకు సంస్థ తరపున రావాల్సినవి అందించాలని, పెండింగ్‌లో ఉన్న రెండు వేతన సవరణ అంశాలు, సీసీఎస్ నిధులను ప్రభుత్వం వాడుకున్న అంశాన్ని, ఆసుపత్రి సేవలు, ఆర్టీసీ అప్పులు తదితర అంశాలను తమిళిసై దృష్టికి తీసుకెళ్లామన్నారు. విలీనం అని చెప్పి ప్రభుత్వం మిగతా సమస్యలను వదిలేసిందని, 2017 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత వేతనాలు ఉన్నాయో అంత ఇవ్వాలని గవర్నర్‌ను అడిగమని తెలిపారు. గవర్నర్ ఆర్టీసీ విలీన బిల్లును అమోదిస్తానని తమకు హామీ ఇచ్చారని ఆర్టీసీ జేఏసీ నేతలు పేర్కొన్నారు.
Governor Tamilisai on TSRTC Bill :గతంలో ఆర్టీసీ బిల్లుపైగవర్నర్ తమిళిసై(Governor Tamilisai on RTC Bill) లేవనెత్తిన అంశాలపై.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చినా.. మరికొన్ని సందేహాలపై వివరణ ఇవ్వాలంటూ తమిళిసై అడిగిన విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీలో భారత ప్రభుత్వ వాటా 30 శాతం ఉన్నందున కేంద్రం సమ్మతి పొందారా లేదా అన్న విషయమై వివరణ కోరిన గవర్నర్.. సమ్మతి పొందినట్లైతే ప్రతిని ఇవ్వాలని లేదంటే చట్టబద్ధత పాటించేలా తీసుకున్న చర్యలను తెలపాలన్నారు.
Pending Bills Issue in Telangana : మళ్లీ రాజ్‌భవన్ చేరిన బిల్లుల కథ.. ఈసారి గవర్నర్ నిర్ణయమేంటో..?