Governor Tamilisai Soundararajan Comments On TS Government :సవాళ్లు, ప్రతిబంధకాలు తనని అడ్డుకోలేవని.. కోర్టు కేసులు, విమర్శలకు భయపడననిరాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Telangana Governor Tamilisai Soundararajan) అన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలతో ఆమెను కట్టడి చేయలేరని పేర్కొన్నారు. ఇదే దృక్పథంతో ముందుకెళ్తానని.. ప్రజల విజయమే తన విజయమని తెలిపారు. ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉంది.. కానీ, రాజ్‌భవన్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పారు. ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేయాలని ఉన్నా నిధుల కొరత ఉందని ఆరోపించారు.
రాజ్‌భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చానని తెలిపారు. ఇక్కడ జిల్లాలకు వెళ్తే ఐఏఎస్ అధికారులు(IAS Officers) రారని.. కానీ, పుదుచ్చేరిలో సీఎస్ సహా చాలా మందిని పర్యవేక్షిస్తున్నానని పేర్కొన్నారు. ఆమెకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని.. తనకు తెలంగాణకు మధ్య దేవుడు ఇచ్చిన బంధం ఉందని వివరించారు. తెలంగాణ ఏర్పాటైన రోజు, గవర్నర్ పుట్టిన రోజు ఒకే రోజు అని ఆనందం వ్యక్తం చేశారు. గవర్నర్‌కు గౌరవం ఇస్తారా.. తన పనిని గుర్తిస్తారా అన్నది అవసరం లేదని చెప్పారు. ఇంకో 30, 40 ఏళ్ల పాటు ఇదే రకంగా ఉంటానని తెలిపారు.
Governor Approves TSRTC Bill : ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం
Governor Tamilisai Completes Four Years in Telangana : ఐరన్ టాబ్లెట్లను ఫార్మా కంపెనీలు నల్లరంగులో కాకుండా విభిన్న రంగుల్లో తయారు చేయాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ సహా వివిధ కార్యక్రమాలు ప్రజలకు పూర్తిగా చేరలేదని స్పష్టం చేశారు. వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం బాగా చేస్తోందని.. ఇంకా చేయాల్సి ఉందని తెలిపారు. కొన్ని వసతి గృహాలు, పారిశుధ్యం ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని.. రెండు చాలా దగ్గరగా ఉన్నాయని వివరించారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు సచివాలయం వెళ్లానని, ఆమె తన మార్గంలో వెళ్తున్నట్లు పేర్కొన్నారు.
అభిప్రాయ భేదాలు మాత్రమే! : గ్యాప్ ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని మీటర్లు ఉందన్నది పట్టించుకోనని.. తాను ప్రభుత్వంతో పోరాడడం లేదని.. తమ మధ్య అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. కొన్ని బిల్లుల్లో లోపాల్ని గుర్తించి వెనక్కు పంపానని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు.ఆర్టీసీ బిల్లుపై తనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలనుగవర్నర్ ప్రస్తావిస్తే ప్రభుత్వం స్పందిస్తుందన్నది.. తన భావనగా తెలిపారు.
Tamilisai Completes 4 Years As The Governor :ప్రజల కోణంలోనే ఆలోచిస్తానని, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు(Governor Kota MLC Positions) కొన్ని ప్రాధాన్యాలు అవసరం, రాజకీయ నామినేషన్ కారాదని చెప్పారు. ఇప్పుడు వచ్చిన ప్రతిపాదనలు సరిపోతాయా.. లేదా అన్నది పరిశీలించేందుకు కొంత సమయం కావాలన్నారు. గవర్నర్ చేసే ప్రతి దానికి కారణం ఉంటుందని తెలిపారు. జిల్లాకు ఒక వైద్యకళాశాల విషయంలో కొంత వివాదం ఉందని.. నిర్ణీత గడువులోగా రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు వెళ్లలేదని కేంద్రం అంటోందని చెప్పారు.