వ్యాప్తి రేటు అధికంగా ఉన్న కరోనా కొత్త స్ట్రెయిన్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. జాగ్రత్తగా ఉండి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని సూచించారు. ఆస్క్ టీఎస్ గవర్నర్ పేరిట ట్విట్టర్లో నెటిజన్ల ప్రశ్నలకు గవర్నర్ సమాధానాలిచ్చారు. విదేశాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి రేటు ఎక్కువగా ఉందని... భయాందోళనకు గురికాకుండా అవసరమైన జాగత్తలు తీసుకోవాలని సూచించారు.
మాస్కు విధిగా ధరించడం సహా భౌతిక దూరాన్ని పాటించడం, చేతులు తరచూ శుభ్రపరచుకోవాలని తెలిపారు. యుూకే నుంచి వచ్చిన వారికి సంబంధించిన జీనోమ్ నివేదికలు ఇంకా రావాల్సి ఉందని తమిళిసై తెలిపారు. వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న శాస్త్రజ్ఞలు, కేంద్ర ప్రభుత్వానికి సెల్యూట్ చేశారు. వ్యాక్సిన్ ద్వారా యాంటీబాడీలు అభివృద్ధి చెంది వైరస్ వ్యాప్తిని అరికడతాయని చెప్పారు.