తెలంగాణ

telangana

ETV Bharat / state

TSPSYCON: 'సాంకేతిక పరిజ్ఞానంతో.. మానసిక సమస్యలను అధిగమించాలి' - psychiatric society awareness program in virtual

ప్రస్తుత జనరేషన్​లో మానసిక సమస్యలతో ఎంతో మంది ఒత్తిడికి గురవుతున్నారని గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే పిల్లలు ఆన్​లైన్​ గేమింగ్​ బారిన పడి వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ సమస్యలకు పరిష్కారంగా టీఎస్​పీసైకాన్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును గవర్నర్​ వర్చువల్​ విధానంలో ప్రారంభించారు. ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది.

TSPSYCON
తెలంగాణ సైకియాట్రీ సొసైటీ అవగాహన సదస్సు

By

Published : Jul 31, 2021, 12:41 PM IST

ఆధునిక సమాజంలో తలెత్తుతున్న మానసిక సమస్యలపై తెలంగాణ సైకియాట్రీ సొసైటీ అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ తాజ్ కృష్ణా హోటల్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రాజ్​భవన్ నుంచి కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్.. దశాబ్దాలుగా చాలా మందిలో మానసిక సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీతో కలిసి టీఎస్‌పీసైకాన్(TSPSYCON) పేరుతో ఏర్పాటు చేసిన ఈ సదస్సు రెండురోజుల పాటు జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు మానసిక నిపుణులు ఆన్​లైన్, ఆఫ్​లైన్ విధానంలో ఈ సదస్సులో పాల్గొననున్నారు. టెక్నాలజీతో ఏర్పడుతున్న మానసిక సమస్యలు,‌ ఆధునిక వైద్య విధానాల గురించి సమావేశంలో విశ్లేషణలు జరగనున్నాయి.

వర్చువల్​ విధానంలో జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభిస్తున్న గవర్నర్​

13 శాతం మందికిపైగా మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారని గవర్నర్​ అభిప్రాయపడ్డారు. కొంతమంది తమ సమస్యలను బయటికి చెప్పుకోవడానికి భయపడతారని పేర్కొన్నారు. చిన్నపిల్లలు ఫోన్​, గేమింగ్ బారినపడి అతి చిన్న వయసులో మానసిక ఒత్తిడి, ఆత్మన్యూనతాభావానికి లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక సమస్యలను అధిగమించేందుకు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటుచేయడం అభినందనీయమని ప్రసంశించారు. ఈ సదస్సు మంచి ఫలితాలను ఇస్తుందని ఆశించారు. ఆధునిక టెక్నాలజీతో పురుషులు, మహిళలు, పిల్లల్లో.. మానసిక రోగాలు, సమస్యలను అధిగమించేందుకు వైద్య రంగం మరింత కృషిచేయాలని గవర్నర్​, నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:BANDI SANJAY: ఈటలకు బండి సంజయ్ పరామర్శ

ABOUT THE AUTHOR

...view details