తెలంగాణ

telangana

ETV Bharat / state

నన్ను ఎవరూ భయపెట్టలేరు.. దేనికి భయపడను కూడా: తమిళిసై - women were still not given respect in the society

Governor in Women's day Celebrations: సమాజంలో మహిళలకు ఇప్పటికీ సరైన గౌరవం దక్కడం లేదని గవర్నర్​ తమిళిసై​ ఆవేదన చెందారు. అత్యున్నత పదవిలో ఉన్న వారు సైతం సరైన గౌరవం పొందడం లేదని విచారం వ్యక్తం చేశారు.

governor tamilisai
గవర్నర్​ తమిళిసై

By

Published : Mar 7, 2022, 9:06 PM IST

ప్రతి మహిళా ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలి: గవర్నర్​

Governor in Women's day Celebrations: మహిళలకు ఇప్పటికీ సరైన గౌరవం దక్కడం లేదని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ అభిప్రాయం వ్యక్తం చేశారు. చివరికి అత్యున్నత పదవిలో ఉన్న వారు సైతం సరైన గౌరవం పొందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తననెవరూ భయపెట్టలేరని.. తాను దేనికి భయపడనని స్పష్టం చేశారు. రాజ్​భవన్​లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో.. మహిళా సాధికారతను ఉద్దేశించి గవర్నర్​ మాట్లాడారు.

ఏ స్త్రీ తన స్వార్థం కోసం ఏదీ కోరుకోదని.. ప్రతిదీ తన కుటుంబం కోసమే కోరుకుంటుందని గవర్నర్​ తెలిపారు. స్త్రీలందరూ ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలని చెప్పారు. భవిష్యత్తు కోసం పొదుపు పాటించాలని చెప్పారు. నిరాశ, నిస్పృహలో కూరుకుపోకుండా ప్రతి అడుగూ నూతనోత్సహంతో ముందుకు సాగాలని చెప్పాలి. మహిళలకు పలు సూచనలు చేస్తూ.. ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు.

ఆనందాన్ని వదులుకోవద్దు

ఈ సందర్భంగా తమిళనాడు మహిళలకు, తెలంగాణ స్త్రీలకు తేడా ఏంటని.. ఇటీవల తనను ఓ ఇంటర్వ్యూలో అడిగారని తమిళిసై అన్నారు. అందరూ ఒకేలా ఉంటారని సమాధానం చెప్పినట్లు తెలిపారు. తెలంగాణ సోదరిగా తాను ఇక్కడి మహిళల జీవన విధానాన్ని ఎంతగానో ఇష్టపడతానని గవర్నర్​ వెల్లడించారు. మహిళలు ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాలని.. ఆనందాన్ని దేని కోసం కూడా వదులుకోకూడదని సూచించారు. ఒక్కోసారి అవకాశం చేజారినా బాధపడాల్సిన అవసరం లేదని.. ఏదైనా సాధించాలనే తపన ఎప్పుడూ ఉండాలని గవర్నర్​ స్పష్టం చేశారు.

"సమాజంలో మహిళలు ఇప్పటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారు. అత్యున్నత పదవిలో ఉన్న మహిళలూ అందుకు మినహాయింపు కాదు. భారతీయ మహిళ ఎవరికీ భయపడదు. ప్రతి మహిళా ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలి. ఏ స్త్రీ అయినా తన స్వార్థాన్ని పక్కనపెట్టి తన కుటుంబం గురించే ఆలిచిస్తుంది. మహిళలు ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాలి. ఏదైనా సాధించాలనే తపనతో ఉండాలి." -తమిళిసై సౌందర రాజన్​, గవర్నర్​

ఇదీ చదవండి:Telangana Budget 2022: రూ.2,56,958 కోట్ల బడ్జెట్‌.. సంక్షేమానికి పెద్దపీట

ABOUT THE AUTHOR

...view details