రాష్ట్రంలో రెడ్‌క్రాస్ వాలంటీర్లు అన్ని వేళలా సంసిద్ధంగా ఉండాలని గవర్నర్ తమిళిసై సూచించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితులపై పుదుచ్చేరి నుంచి రాజ్‌భవన్ అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా యూనిట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.
governor tamilisai: హై అలర్ట్‌గా ఉండండి: తమిళిసై
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదల దృష్ట్యా.. రెడ్‌క్రాస్ వాలంటీర్లు హైఅలర్ట్‌లో ఉండాలని గవర్నర్ తమిళి సై సూచించారు. పుదుచ్చేరి నుంచి రాజ్‌భవన్ అధికారులు, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా యూనిట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవ చేయాలని గవర్నర్ సూచించారు. రాష్ట్రంలో పంట, ఆస్తి నష్టంపై ఆందోళన వ్యక్తం చేశారు. మెడిసిన్, ఆహారం, దుప్పట్లు, ఇతర అవసరమైన వస్తువుల పంపిణీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రెడ్‌క్రాస్ ద్వారా సేవలందించటంపై రాష్ట్ర అధికారులతో రాజ్‌భవన్ అధికారులు సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. జిల్లా స్థాయిలో రెడ్‌క్రాస్ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి సమన్వయం చేసుకోవాలని కోరారు. ఆరోగ్య శాఖ అధికారులు డెంగీ, మలేరియా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్ పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.
ఇదీ చూడండి:telangana floods: మత్తడి దూకుతున్న చెరువులు.. జనావాసాలు జలమయం...