లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు తన వంతుగా సాయం అందిస్తూ అండగా నిలుస్తోన్న ఓ వ్యక్తిని గవర్నర్ తమిళిసై ప్రత్యేకంగా అభినందించారు. ట్విట్టర్ వేదికగా సంఘ సేవకుడు పుట్టా రామకృష్ణను చేస్తోన్న భోజనం, నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమాలను ఆమె కొనియాడారు.
రామకృష్ణ.. తాను చేసిన సేవ కార్యక్రమాల గురించి గవర్నర్‌కు ట్వీట్ చేశారు. దీనికి తమిళిసై ధన్యవాదాలు తెలపడంతో పాటు సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. కష్ట కాలంలో ప్రతి ఒక్కరు పేదలకు తమ వంతుగా సాయం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
సంఘ సేవకుడికి.. గవర్నర్ అభినందనలు - governor tamilisai twitter profile name
లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న పేదలకు మానవతావాదులు అండగా నిలుస్తున్నారు. కష్ట కాలంలో భోజనం, నిత్యావసరాలు పంపిణీ చేసి.. ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఇలాగే నిరుపేదలను ఆదుకుంటోన్న ఓ సంఘ సేవకుడిని.. గవర్నర్ తమిళిసై ప్రత్యేకంగా అభినందించారు.
గవర్నర్ తమిళిసై
ఇదీ చదవండి:రానున్న మూడురోజులు రాష్ట్రానికి వర్షసూచన