తెలంగాణ బతుకు పండుగ బతుకమ్మలోని ఆరోగ్య సూత్రాలను ప్రజలకు చేరువ చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai about bathukamma) సూచించారు. మంచి జీవితాన్ని కోరే సంబురమే బతుకమ్మ అని.. బతుకమ్మ సంబురాల్లో ఆరోగ్యం దాగి ఉందని అన్నారు. తెలుగు యూనివర్శిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి గవర్నర్(Governor Tamilisai participated in bathukamma celebrations) పాల్గొన్నారు.
పండుగ శుభాకాంక్షలు
బతుకమ్మ సంబురాల్లో గవర్నర్ తమిళిసై, బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్సీ కవిత
అందరికీ సంతోషకర జీవితం దక్కాలని ప్రార్థించానని గవర్నర్ పేర్కొన్నారు. బతుకమ్మకు(bathukamma festival 2021) ప్రచారం కల్పించిన కవితకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మను తలపైకి ఎత్తుకున్న గవర్నర్... మహిళలతో కలిసి చప్పట్లతో నీరాజనాలు అందించారు.