మహిళలు ప్రతిరంగాన్ని సవాల్‌గా తీసుకుని ముందుకు వెళ్లాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం ఎంతో అవసరమన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్‌లో జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ముగింపు వేడుకలకు తమిళిసై, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరయ్యారు. మొదట తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన తమిళిసై మరో మూడు నెలల్లో పూర్తిగా భాష మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు లక్ష్మణ్‌తో కలిసి ధ్రువపత్రాలను అందజేశారు. తన చివరి శ్వాస వరకు ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేస్తానని లక్ష్మణ్ అన్నారు.
"మహిళల్లో పోటీతత్వం పెరగాలి.. అన్నిరంగాల్లో రాణించాలి" - ముషీరాబాద్‌లో మహిళా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో టీ-గవర్నర్
జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ముషీరాబాద్‌లో మహిళా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ముగింపు వేడుకలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరయ్యారు. మహిళలు ప్రతి రంగాన్ని సవాల్‌గా తీసుకుని ముందుకెళ్లాలని తమిళిసై అన్నారు.
ముషీరాబాద్‌లో మహిళా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో తమిళిసై