తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం దీపావళి శుభాకాంక్షలు - ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు

Governor and CM wished Diwali Greetings: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతమే దీపావళి పండుగ అని అన్నారు. ఈ దీపావళి.. చీకట్లను పారదోలి ప్రజల జీవితాల్లో మరిన్ని కాంతులు నింపాలని గవర్నర్, ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Governor and CM
Governor and CM

By

Published : Oct 23, 2022, 8:15 PM IST

Governor and CM wished Diwali Greetings: దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి చాటి చెప్పేలా స్థానిక ఉత్పత్తులతోనే దీపావళి పండుగ జరుపుకోవాలని రాష్ట్ర గవర్నర్ సూచించారు. దీపావళి అంటేనే ప్రతి ఒక్కరి జీవితంలో చీకట్లను పారద్రోలి కొత్త కాంతులు విరజిమ్మేలా ఆనందం, సంతోషాలను తీసుకొస్తుందని పేర్కొన్నారు.

ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో స్వదేశీ తయారీదారుల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని తమిళిసై పిలుపునిచ్చారు. దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు, సంతోషం, శ్రేయస్సు, కొత్త ఆలోచనలు, ఆదర్శాలను తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.

చెడుపై సాధించిన విజయానికి సంకేతమే దీపావళి..చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతమే దీపావళి పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అజ్ఞానాంధకారాలను తొలగించి విజ్ఞానపు వెలుగును దీపావళి ప్రసాదించాలని సీఎం వేడుకున్నారు. తెలంగాణ మాదిరిగా దేశ ప్రజలందరి జీవితాల్లో ఆనందపు ప్రగతి కాంతులు వెల్లివిరియాలని.. సుఖ శాంతులు, సిరి సంపదలతో తులతూగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు వహించండి.. బాణాసంచా వెలిగించే సమయంలో ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు వహించాలని కోరారు. భక్తి శ్రద్ధలతో పర్యావరణ హితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకు రావాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details