తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశ ప్రతిష్ఠను పెంపొందించండి: గవర్నర్ తమిళిసై - Telangana news

ఐఎఫ్ఎస్ 2020 బ్యాచ్ ట్రైనీ అధికారులు ముతినేని సాయి తేజ, కాసారపు ప్రేమ్ సాగర్​లతో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఐఎఫ్ఎస్​కు ఎంపికైనందుకు గవర్నర్ వారిని అభినందించారు.

ifs trainee officers
ఐఎఫ్ఎస్

By

Published : Apr 8, 2021, 7:16 PM IST

దేశ ప్రతిష్ఠను పెంపొందించడానికి కృషి చేయాలని ట్రైనీ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారులకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. ఐఎఫ్ఎస్ 2020 బ్యాచ్ ట్రైనీ అధికారులు ముతినేని సాయి తేజ, కాసారపు ప్రేమ్ సాగర్​లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ మాట్లాడారు.

ఐఎఫ్ఎస్ అధికారులు

ఐఎఫ్ఎస్​కు ఎంపికైనందుకు గవర్నర్ వారిని అభినందించారు. దేశంలో, విదేశాల్లో భారత్ పేరును పెంపొందించటంలో ఐఎఫ్ఎస్​ల పాత్ర కీలకమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్​ ప్రతిష్ట సానుకూలంగా మారుతోందన్నారు. కరోనా టీకా 150 దేశాలకు సరఫరా చేయటం వల్ల దేశానికి మంచి పేరు వచ్చిందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఆర్టీపీసీఆర్‌ పరీక్షలపై హైకోర్టు అసంతృప్తి

ABOUT THE AUTHOR

...view details