విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం అనితర సాధ్యమైన విజయాలు సాధించిందని గవర్నర్ తమిళిసై శాసనసభ సమావేశంలో పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో విద్యుత్ గరిష్ఠ డిమాండ్ 13,162 మెగావాట్లు ఉండగా... తెలంగాణలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 13,168 మెగావాట్లు వచ్చిందని తెలిపారు. ఉమ్మడి ఏపీలో కంటే తెలంగాణలో ఎక్కువ డిమాండ్ ఉన్నా లోటు, కోత లేకుండా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
విద్యుత్ రంగంలో తెలంగాణ ఆదర్శం: గవర్నర్
రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గవర్నర్ తమిళిసై శాసనసభలో ప్రశంసించారు. విద్యుత్ రంగంలో రాష్ట్రం అనితరసాధ్యమైన విజయాలు సాధించిందని పేర్కొన్నారు.
విద్యుత్ రంగంలో తెలంగాణ భేష్: గవర్నర్
రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వివరించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చేందుకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం శరవేగంగా సాగుతోందని అన్నారు.
ఇదీ చూడండి: కేసీఆర్ కృషితో ప్రగతిపథంలో రాష్ట్రం: గవర్నర్