తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా నివారణ చర్యలపై గవర్నర్​ తమిళి సై వివరణ - తెలంగాణ గవర్నర్​ తమిళి సై

కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్న ప్రతి సిబ్బందికి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. గవర్నర్లు, లెఫ్టినెంట్​ గవర్నర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో కరోనా నివారణ చర్యలపై గవర్నర్​ తమిళి సై వివరించారు. వైరస్​ సోకిన రోగులందరూ క్రమంగా కోలుకుంటున్నారని వెల్లడించారు.

కరోనా నివారణ చర్యలపై గవర్నర్​ తమిళి సై వివరణ
కరోనా నివారణ చర్యలపై గవర్నర్​ తమిళి సై వివరణ

By

Published : Mar 27, 2020, 8:57 PM IST

కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు.. వివిధ విభాగాల కృషి అభినందనీయమని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై వివరించారు. ప్రభుత్వం మార్చి 23 నుంచి తెలంగాణలో లాక్ డౌన్ విధించినట్లు ఆమె తెలిపారు.

ప్రస్తుతం కరోనా వైరస్ సోకిన రోగులందరూ క్రమంగా కోలుకుంటున్నారని.. ఇప్పటికే ఒకరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తమిళిసై పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన 20,475 మందిని స్వీయ నిర్బంధంలో ఉంచినట్లు వెల్లడించారు. కరోనా వైరస్​పై అవగాహన కల్పించేలా 3 భాషల్లో స్వల్ప నిడివి గల చిత్రాలను రూపొందించి.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నామన్నారు. కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు పనిచేస్తోందని.. సందేహాలు, అనుమానాలు, భయం ఉన్న ప్రజలు 104 నెంబర్​కు ఫోన్ చేస్తే అధికారులు తగిన విధంగా స్పందిస్తున్నారని ఆమె వివరించారు.

కొవిడ్​-19ను నిర్ధరించడానికి ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని.. వీటిలో ఇప్పటికే పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు తమిళి సై పేర్కొన్నారు. ఐసీఎంఆర్ అనుమతి మేరకు మరో మూడు ప్రైవేట్ పరీక్షా కేంద్రాలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అవసరమైన ఆస్పత్రులను వినియోగించుకునేందుకు ఇప్పటికే యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసినట్లు గవర్నర్ తమిళిసై.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు.

ఇదీ చూడండి:కరోనాకు మందు లేదు.. ఓ ఆయుధం ఉంది: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details