తెలంగాణ

telangana

ETV Bharat / state

నిబంధనలకు లోబడి ఉత్సవాలు నిర్వహించుకోండి: గవర్నర్‌ - గవర్నర్​ తమిళి సై తాజా వార్తలు

తెలంగాణ ప్రజలంతా కరోనా నిబంధనలకు లోబడి గణేశ్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ కోరారు. హైదరాబాద్‌ రాజ్‌ భవన్‌లో అధికారులు, సిబ్బందికి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.

నిబంధనలకు లోబడి ఉత్సవాలు నిర్వహించుకోండి: గవర్నర్‌
నిబంధనలకు లోబడి ఉత్సవాలు నిర్వహించుకోండి: గవర్నర్‌

By

Published : Aug 21, 2020, 10:03 PM IST

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మట్టి గణపతులను పంపిణీ చేశారు. హైదరాబాద్‌ రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అధికారులు, సిబ్బందికి మట్టితో చేసిన గణపతి విగ్రహాలను అందించారు.

ప్రజలంతా కొవిడ్ నిబంధనలకు లోబడి గణేశ్‌ ఉత్సవాలు నిర్వహించుకోవాలని గవర్నర్‌ కోరారు. అలాగే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తమిళి సై వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి:'దట్టమైన పొగల వల్లే లోనికి వెళ్లడం కష్టమవుతోంది'

ABOUT THE AUTHOR

...view details