రాజ్‌భవన్ సిబ్బందికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రముఖ భారత క్రికెటర్ మిథాలీ రాజ్‌తోపాటు ఓ స్వచ్ఛంద సంస్థ నిత్యాసర సరకుల కిట్లను సమకూర్చింది.
సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేసిన గవర్నర్, క్రికెటర్ - Governor tamila sai cricketer mithali raj distributed the necessities to the raj bhavan staff
కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌తో పేదలు ఉపాధి కరవై ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల దాతలు, సంస్థలు ముందుకొచ్చి సాయం చేస్తున్నాయి. ఈ తరుణంలో రాజ్‌భవన్‌లో సిబ్బందికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, క్రికెటర్ మిథాలీ రాజ్ నిత్యావసరాలు పంపిణీ చేశారు.
సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేసిన గవర్నర్, క్రికెటర్
ఆ సరుకుల కిట్లను రాజ్‌భవన్‌లో పనిచేసే నాల్గో తరగతి ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు గవర్నర్ అందజేశారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో ఇవాళ 41 కరోనా కేసులు