దేశంలో హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం తరహాలో విత్తన విప్లవం రావాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసీసీలో 32వ ఇస్టా సదస్సు - 2019 ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విత్తనం అనేది ఒక వస్తువు కాదని సేద్యంలో కీలకమైన ఉపకరణమని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందని గుర్తు చేశారు. వ్యవసాయ రంగం సంక్షోభం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి రైతు కుటుంబాలు నగరాలు, పట్టణాలకు వలసబాట పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాసిరకం, నకిలీ విత్తనాలు విక్రయించిన వర్తకులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తోందని గవర్నర్ నరసింహాన్ కొనియాడారు.
'హరిత, నీలి విప్లవం తరహాలో విత్తన విప్లవం రావాలి'
దేశంలో తెలంగాణ విత్తన భాండాగారంగా రూపొందుతుందని గవర్నర్ నరసింహన్ అన్నారు. దేశంలో విత్తన విప్లవం రావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ ఇష్టా సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విత్తనం సేద్యంలో చాలా కీలకమని తెలిపారు. రైతుల ఆదాయం మెరుగయ్యేలా నిపుణులు కొత్త పద్ధతులు కనుగొనాలని సూచించారు. నకిలీ విత్తనాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ప్రశంసించారు.
విత్తన సదస్సు