రాజ్‌భవన్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ పక్షికి గాయంతో నీరసంగా పడి ఉండగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రక్షించారు. పక్షుల నిపుణుడిని సంప్రదించి చికిత్స అందించారు. అనంతరం జూపార్కు అధికారుల వద్దకు తీసుకెళ్లగా గద్ద అని తెలియజేశారు.
గాయపడిన పక్షిని రక్షించిన గవర్నర్ తమిళిసై - రాజ్‌భవన్ వార్తలు
రాజ్‌భవన్ పరిసరాల్లో నీరసంగా పడి ఉన్న ఓ పక్షిని రక్షించారు గవర్నర్. ఆమె నడుస్తున్న క్రమంలో పక్షిని గుర్తించి నిపుణుడిని సంప్రదించారు. వెంటనే అతను వచ్చి చికిత్స అందించారు. ఆ పక్షిని జూపార్కు అధికారులకు చూపించగా గద్దగా తేల్చారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
![గాయపడిన పక్షిని రక్షించిన గవర్నర్ తమిళిసై Governor rescues injured bird in raj bhavan premises](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9875248-939-9875248-1607944556660.jpg)
రాజ్‌భవన్‌లో గాయపడిన పక్షిని రక్షించిన గవర్నర్
ప్రస్తుతం గద్ద ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. మళ్లీ రాజ్‌భవన్ పరిసరాల్లో పక్షి ఎప్పుడు తిరుగుతుందా వేచి చూస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.