వైద్యరంగానికి సాంకేతికత చాలా ముఖ్యమైనదని గవర్నర్ నరసింహాన్ అభిప్రాయపడ్డారు. మనిషికి ఆరోగ్యం ముఖ్యమని, 108 అంబులెన్స్ సర్వీస్‌లను, బస్తీ దవాఖానాలను కలిపి ఫ్యామిలీ డాక్టర్స్ పద్ధతిని తీసుకురావాలన్నారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని జీవీకే ఇఎమ్‌ఆర్‌ఐ ప్రధాన క్యాంపస్‌లో నిర్మించిన అత్యాధునిక ఎమర్జెన్సీ కేర్ సిమ్ములేషన్ కాంప్లెక్స్‌ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. బంగారు తెలంగాణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని గవర్నర్ నరసింహన్ వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భవించిన అతికొద్ది కాలంలోనే రాష్ట్రాన్ని ఆరోగ్య రాష్ట్రంగా తీర్చిదిద్దామని వైద్య, ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రముఖులు చేయూతనివ్వాల్సిన అవసరముందని తెలిపారు. హైదరాబాద్ మెడికల్ హబ్‌గా నిలిచిందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ అధ్యక్షతన ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దగలిగామని చెప్పారు.
'ఫ్యామిలీ డాక్టర్స్ పద్ధతిని తీసుకురావాలి'
మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని జీవీకే ఇఎమ్‌ఆర్‌ఐ ప్రధాన క్యాంపస్‌లో నిర్మించిన అత్యాధునిక ఎమర్జెన్సీ కేర్ సిమ్ములేషన్ కాంప్లెక్స్‌ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
'ఫ్యామిలీ డాక్టర్స్ పద్ధతిని తీసుకురావాలి'